కమలాపూర్ పోలీస్ స్టేషన్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం వారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టేషన్ పరిసరాలతో పాటు సిబ్బంది సీఐ కార్యాలయము పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సీఐ హరికృష్ణని అడిగి తెలుసుకున్నారు.