ప్రతి హాస్టల్ లో నిబంధనలో మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం రాత్రి వంగరలోని పివి రంగారావు తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల కళాశాలను హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. పాఠశాల కళాశాలలోని విద్యార్ధినుల తరగతి గదులు, డార్మెట్రీ, వంట గదులను తనిఖీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు.