చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం హనుమకొండ రాం నగర్ ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. వసతిగృహాన్ని రాత్రి 9 గంటల వరకు విద్యార్థులతో గడిపారు. హాస్టల్‌లోని వంటగది, వంట చేసే తీరును, పరిసరాలను పరిశీలించి వార్డెన్ 24 గంటలు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.