అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్, తదితర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ అధికారులు, సూపర్ వైజర్లు, పంచాయతీరాజ్ అధికారులతో అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పెయింటింగ్, టాయిలెట్స్, అభివృద్ధి పనులపై సమీక్షించారు.