స్మార్ట్ సిటీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ ఎఫైర్స్ జాయింట్ సెక్రెటరీ రూపా మిశ్రా అన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఎంపికైన నగరాల మేనేజింగ్ డైరెక్టర్లు/కమిషనర్లు అధికారులతో బుధవారం దృశ్య మాధ్యమం ద్వారా స్మార్ట్ సిటీ పథకం క్రింద నిధుల వినియోగంపై ఢిల్లీ నుండి సమీక్షించారు. వరంగల్ నుండి కమిషనర్ అశ్విని అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు.