ఆసక్తి కలిగిన విద్యార్థులు అడ్వెంచర్ ఆక్టివిటీస్ లో పాల్గొనాలని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జయంతి అన్నారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు చెందిన 400 మంది విద్యార్థినులకు మంగళవారం నుండి ఫోర్టు వరంగల్ లోని ఏకశిలా పార్కులో సాహస కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కయాకింగ్, వర్టికల్ ల్యాడర్ క్లయిమ్బింగ్, సింపుల్ సౌల్యూషన్ టూ కాంప్లెక్స్ ప్రాబ్లెమ్స్, రాప్లింగ్ సంబంధించి శిక్షణనిస్తున్నట్లు తెలిపారు.