ఎన్ఎస్పీ కాలువ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్
సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. తెగిపోయిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ పునర్నిర్మాణానికి రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.10,300 కోట్ల మేర అస్తి నష్టం జరిగిందన్నారు.