సూర్యాపేట జిల్లా చరిత్రను వ్యాసాల రూపంలో స్పష్టంగా విశ్లేషించిన కోదాడ కె ఆర్ ఆర్ జూనియర్ కళాశాల అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు అభినందనీయులని తెలంగాణ సారసత్వ పరిషత్తు అధ్యక్షులు ఆచార్య డా. ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డా. జెర్రు చెన్నయ్య లు అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా సమగ్ర స్వరూపంపుస్తకావిష్కరణ లో వ్యాసకర్త వేముల ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు ఉన్నారు.