ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు మూసి ప్రాజెక్టు కు వరద కొనసాగుతుంది. మూడు గేట్లను ఒక ఫీటు మెరపైకెత్తి దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేశారు. ప్రస్తుత నీటిమట్టం 643. 64 అడుగులు, పూర్తిస్థాయి నీటిమట్టం 645. 00, ప్రస్తుత నీటి సామర్థ్యం 4. 10 టిఎంసిలు, ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4. 46 టీఎంసీలు, అవుట్ ఫ్లో 1735. 67 క్యూసెక్కులు, గేట్లు 3, 1 ఫిట్ ఎత్తు ఇన్ ఫ్లో 3560. 50 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు.