తుంగతుర్తి నూతన తహశీల్దార్‌గా దయానందం బాధ్యతలు

72பார்த்தது
తుంగతుర్తి నూతన తహశీల్దార్‌గా దయానందం బాధ్యతలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నూతన తహశీల్దార్‌గా పి. దయానందం శుక్రవారం బాధ్యతలను చేపట్టారు. బదిలీల్లో భాగంగా జనగాం జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహశీల్దార్‌ రమణారెడ్డి బదిలీ పై వెళ్లారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు.

தொடர்புடைய செய்தி