మల్కాజిగిరి సర్కిల్ ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి
జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అందించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని డీసీ రాజు ఆయా విభాగాల అధికారులను సోమవారం ఆదేశించారు. ప్రజావాణిలో 9 ఫిర్యాదులు అందాయని వీటిలో టౌన్ ప్లానింగ్, డ్రైనేజీ, ఇంజినీరింగ్ సమస్యలపై ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులకు అధికారులు స్పందించడం లేదని కార్పొరేటర్ శ్రావణ్ డీసీ రాజుకు ఫిర్యాదు చేశారు.