
సికింద్రాబాద్: వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కార్పొరేటర్
ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ ముద్దం నర్సింహ్మ యాదవ్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని వల్లభనగర్, దేవినగర్ లోని కాలనీలోని ఈద్గా ప్రాంగణంలో రిలయన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేసారు. వైద్య శిబిరంను స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహ్మయాదవ్ ముఖ్య అతిధిగా హజరై రిలయన్స్ ఆసుపత్రి యజమాని వాజీద్ తో కలిసి ప్రారంభించారు.