లాల్ బజార్ లో ఘనంగా మహంకాళి బోనాల జాతర

71பார்த்தது
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి 7వ వార్డు లాల్ బజార్ మహంకాళి అమ్మవారి ఆలయంలో బుధవారం ఘనంగా బోనాల జాతర నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, భారీ పోలీసు బందోబస్తు చేపట్టామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி