సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: రామకృష్ణ
ప్రజల కోసమే పనిచేస్తున్న, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్, బీజేపీ నేత రామకృష్ణ పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని 5వ వార్డు శాంతి దీప్ కాలనీలో సోమవారం మీట్ యువర్ మెంబర్ కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు. శాంతి దీప్ కాలనీ వాసులు సమస్యలను తెలుసుకున్న ఆయన పరిష్కారానికి హామీ ఇచ్చారు. నూతన నాళాలు, వాటర్ లైన్, సీసీ రోడ్డు, వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.