సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించిన కార్పొరేటర్ సామల హేమ
సీతాఫాల్మండి డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్యలపై అధికారులు చర్యలను తీసుకోవాలని డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ సూచించారు. గురువారం జలమండలి ఎండీ అశోక్‌తో కలిసి మహమ్మదూడలో పర్యటించారు. స్థానికంగా తరచూ డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్యలు వస్తున్నాయని ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు.