రేషన్ డీలర్ల రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా ఎమ్మెల్యే ఎన్నిక
పటాన్చెరు డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. పటాన్ చెరులోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సంఘం సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. డీలర్లు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.