బ్రాయిలర్ కోళ్లను తినడం కంటే నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాయిలర్ చికెన్‌లో ప్రొటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో క్రమంగా బరువు పెరుగుతారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో లిపిడ్ స్థాయిలు కూడా పెరిగిపోతాయి. పౌల్ట్రీ కోళ్లకు ఇచ్చే యాంటీబయోటిక్ ఇంజెక్షన్ల వల్ల ఆ చికెన్ తినేవారిలో యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోతుంది.