ఏపీలోని కుప్పంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. పిఈఎస్ మెడికల్ కళాశాల నర్సింగ్ హాస్టల్‌లోకి యువకుడు చొరబడ్డాడు. కేరళ చెందిన ప్రియుడిని ఓ యువతి హాస్టల్‌కి పిలిపించుకుంది. ఒకే గదిలో ఆరుగురు నర్సింగ్ విద్యార్థినులు ఉండగా, బురఖా వేసుకొని మారు వేషంలో లేడీస్ హాస్టల్‌కు ప్రియుడు వెళ్లాడు. ఆటో డ్రైవర్లు వార్డెన్‌కు సమాచారం ఇవ్వడంతో కాలేజీ సిబ్బంది ఆ యువకుడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.