కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం ఫిర్యాదు చేసారు. మతిస్థిమితం తప్పి కేసీఆర్ పైన అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్న బండి సంజయ్ ఆరోపణలు కాదు దమ్ముంటే నిరూపించమని హెచ్చరించారు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే ప్రస్తుతం ఉన్నది మీ ప్రభుత్వమే కనుక మీరే రాయండి నిజానిజాలు ఏందో ఎంక్వయిరీ చేసి తెలంగాణ ప్రజలకు తేల్చి చెప్పాలి అన్నారు.