గాంధీ ఆస్పత్రిలో 9 ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో 156 మంది స్టాఫ్ నర్సులు, 71 మంది ఆరోగ్య శ్రీ ఉద్యోగులు, 2, 007 మంది ఫోర్త్ క్లాస్ సిబ్బంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు, డిసెంబర్ 31, 2024తో వీరి కాల పరిమితి ముగిసింది. జనవరి నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్లు ఈఎస్ఐ, పిఎఫ్ కూడా కట్టడం లేదని కార్మికులు శనివారం ఆరోపిస్తున్నారు.