ఉప్పల్ లో గురువారం నవత ట్రాన్స్‌పోర్ట్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మాచర్ల జోసెఫ్ కుమార్ అనే పాస్టర్ దుర్మరణం పాలయ్యాడు. గురువారం సికింద్రాబాద్ లో పగడాల ప్రవీణ్ కుమార్ అంత్యక్రియలకు జోసెఫ్ కుమార్ వెళ్తుండగా నవత ట్రాన్స్‌పోర్ట్ లారీ అత్యంత వేగంగా ఢీకొట్టింది. కాగా మృతుడి కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉప్పల్ పీఎస్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు, నాయకులు ధర్నా చేశారు.