ఓయూలో కొన్ని అసాంఘిక శక్తులు చేరి విద్యా వాతావరణాన్ని పాడు చేసే అవకాశం ఉన్నందున విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. ఈ మేరకు ఓయూ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ బాలస్వామి మాట్లాడారు. ఓయూలో విద్యా వాతావరణాన్ని పాడు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.