కంటోన్మెంట్ ఏఓసి తాపర్స్ మైదానంలో మీడియా ప్రతినిధులు, కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది జట్ల మధ్య 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరిగింది. ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. ఒత్తిడితో కూడుకున్న రోజువారీ జీవితంలో క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.