గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలి

78பார்த்தது
కేంద్ర ప్రభుత్వం గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్ చేశారు. గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్ నాయక్ మాట్లాడారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி