
నాచారం డివిజన్ సమస్యలపై జోనల్ కమిషనర్ కు వినతిపత్రం
నాచారం డివిజన్ సమస్యలపై జోనల్ కమిషనర్ కు నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. డివిజన్లో ప్రధానంగా ఎండాకాలం అయినా కూడా పటేల్ కుంట చెరువులలో పెద్ద ఎత్తున గుర్రపు డెక్క నిలిచి ఉండడంతో విపరీతమైన దోమల సమస్యతో నాచారం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే చెరువులోని గుర్రపు డెక్క తొలగించాలని కోరడం జరిగింది. అలాగే హిందూ స్మశాన వాటిక లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది.