ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సాధించారు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం 259 మ్యాచ్‌లు ఆడి 600 ఫోర్లు కొట్టారు. గుజరాత్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 600 ఫోర్స్ పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన వారిలో రోహిత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. మొదటి మూడు స్థానాల్లో శిఖర్ ధావన్ 768, కోహ్లీ 711, డేవిడ్ వార్నర్ 663 ఫోర్లతో ఉన్నారు.