డోర్నకల్ ఎమ్మెల్యే రామ్ చంద్రు నాయక్ కి మంత్రి పదవి ఇవ్వాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. ఓయూ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సురేష్ నాయక్ మాట్లాడుతూ. రాబోవు మంత్రివర్గ విస్తరణలో బంజారా బిడ్డలకు అవకాశం ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో బంజారాలు వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం జరిగిందన్నారు.