
ఉట్కూర్: మహిళలు, రైతుల చట్టాలపై అవగాహన
ఉట్కూర్ మండలం పులిమామిడి గ్రామంలో శుక్రవారం జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో మహిళలు రైతుల చట్టాలపై అవగాహన కల్పించినట్లు పార లీగల్ వాలంటీర్ హాజమ్మ తెలిపారు. పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు అందించేందుకు జిల్లా కోర్టులో ప్రత్యేక న్యాయవాదులను నియమించినట్లు చెప్పారు. వారి నుండి ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చు అని సూచించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.