వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి భారీ ఊరట లభించింది. VSR విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు.. విజయసాయిరెడ్డి నెల రోజులు అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయసాయి విదేశీ పర్యటనకు 15 రోజులు మాత్రమే అనుమతినిచ్చింది. దీంతో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10లోపు 15 రోజుల పాటు.. ఆయన ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్లొచ్చని సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.