నారాయణపేట మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలో రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ఉట్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొన్నారు. నాలుగు పథకాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు అందించే పేదోడి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు.