

మక్తల్: సీఎం సభకు బయలుదేరి వెళ్లిన నేతలు
నారాయణపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మక్తల్ నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వాహనాల శ్రేణిని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ పాల్గొనే బహిరంగ సభకు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా తరలి వచ్చారని అన్నారు.