మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేసిన బురాన్ గడ్డ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, శరీరం దృఢంగా మారుతుందని అన్నారు. పోటీల నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.