ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం మక్తల్ పట్టణంలోని ఎంపీపీఎస్ పాఠశాలను, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. పాఠశాలలో సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని చెప్పారు. ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. తన చిన్ననాటి విద్యాభ్యాసం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు లక్ష్యం ఏర్పాటు చేసుకొని విద్యను కొనసాగించాలని సూచించారు.