మౌని అమావాస్యను పురస్కరించుకొని బుధవారం శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలోని పురాతన శివాలయంలో ఆలయ అర్చకులు జంగం సుగురయ్యచే శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. జలాభిషేకం, పుష్పాలంకరణ, మహా మంగళహారతి, నైవేద్యం సమర్పించారు. భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకొని పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం చేశారు.