గత బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విమర్శించారు. ఆదివారం అమరచింత మండలంలోని చింతా రెడ్డి పల్లి గ్రామంలో నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలు అందించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.