దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ ఆధ్వర్యంలో మహాకుంభమేళకు వచ్చిన భక్తులకు కాశి పుణ్యక్షేత్రంలోని అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం బోలా శంకర వాసవి అన్నపూర్ణ నిత్యఅన్నదాన సత్రం ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కుంభమేళ భక్తులకు సౌకర్యార్థం అన్నదానం కార్యక్రమం చేపడుతున్న అన్నారు.