ఉన్నత చదువులకు పునాది లాంటిది పదవ తరగతి అని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. గురువారం నర్వ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2డి, 3డి డిజిటల్ స్టడీ మెటీరియల్ అందజేశారు. క్యూఆర్ ను స్మార్ట్ మొబైల్ తో స్కాన్ చేస్తే పాఠ్యాంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని, సులువుగా చదువుకోవచ్చని చెప్పారు.