ఇటీవల బీఅర్ఎస్ పార్టీ ఏర్పరచిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శనలో భాగంగా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిల్పుర్ మండలం, మల్కాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనీ వైద్య ఆరోగ్య పరిస్థితులను చూసి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.