బైక్‌పై వెళుతుండగా ఎదురొచ్చిన సింహం.. వీడియో వైరల్

56பார்த்தது
గుజరాత్ రాష్ట్రంలోని ఉనా జిల్లా నవబందర్ గ్రామంలో ఒక మహిళ, మరో వ్యక్తి కలిసి బైక్‌పై వెళుతుండగా ఓ సింహం వారికి ఎదురుగా వచ్చింది. ఒక్కసారిగా సింహాన్ని చూసి భయపడిన వారిద్దరూ బైక్‌ను అక్కడే వదిలేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. కానీ సింహం మాత్రం కూల్ గా నడుచుకుంటూ వెళుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி