ఉరేసుకొని విహహిత ఆత్మహత్య
భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సిర్గాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కిషన్ నాయక్ తాండకు చెందిన జనాబాయి (35) తన భర్త నాందేవ్ మద్యంకు బానిసై, అనుమానంతో కొట్టడం, వేధించడం మొదలుపెట్టాడు. ఈ బాధలు భరించలేక జనబాయి చేనులోని వేప చెట్టుకు ఉరేసుకుంది. ఆమె తండ్రి రాథోడ్ లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదుకు కేసు నమోదు చేసినట్లు ఎస్సైతెలిపారు.