మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కల్హేర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు అలుగు సోమవారం పారింది. వర్షపు నీరు దిగువ ప్రాంతాలకు భారీ సంఖ్యలో చేరింది. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. చేళ్లలోకి నీరు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి నష్టపరిహారం ఇప్పించాలని రైతులకు కోరుతున్నారు.