పూణె విమానాశ్రయం పేరు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

66பார்த்தது
పూణె విమానాశ్రయం పేరు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పూణె విమానాశ్రయం పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పూణెలోని లోహ్‌గావ్ విమానాశ్రయం పేరు మారుస్తూ.. ‘జగద్గురు సంత్‌ తుకారాం మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం’గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను తదుపరి రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదించిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపనున్నారు.

தொடர்புடைய செய்தி