దక్షిణ కోస్తా రైల్వేజోన్ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీలతో డివిజనల్ కమిటీ తొలిసారిగా విశాఖలో సమావేశమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, తూర్పుకోస్తా రైల్వే జీఎం, వాల్తేర్ డివిజినల్ మేనేజర్ హాజరయ్యారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి 10 మంది ఎంపీలు భేటీలో పాల్గొన్నారు.