వర్షానికి కూలిన ఇల్లు.. ఒకరికి స్వల్ప గాయాలు

82பார்த்தது
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నారాయణఖేడ్ మండలం ఆకుల లింగాపూర్ కు చెందిన ఇంటెనుక నాగమ్మ ఇల్లు ఆదివారం రాత్రి కూలి ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఇంట్లో ఉన్న సామాగ్రి ధ్వంసం అయ్యి రూ. 50 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలుసుకున్న ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి అలిగే జీవన్ కుమార్ బాధిత కుటుంబాన్ని సందర్శించారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి నిరుపేద కుటుంబానికి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி