గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి
జూలూరుపాడు గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ రాణా ప్రతాప్ సింగ్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు శనివారం సూచించారు. ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని చెప్పారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమాల్లో చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తగా ఉండాలని, చిన్నారులను అనుమతించొద్దని ఆయన అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.