వైరా మండల వ్యాప్తంగా గత రెండు రోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులపైకి మోకాళ్ల వరకు వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ప్రధాన కూడళ్లు జలమయమయ్యాయి. మరోవైపు ఉదయం నుంచి ఆగకుండా వర్షం కురుస్తుండడంతో రైతులు, కూలీలు, ప్రజలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.