ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించి కళాశాలలో గల పలు సమస్యలను గురించి కళాశాల అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.