వైరా: కోటమైసమ్మ జాతర ఆదాయం రూ. 27. 17లక్షలు
కారేపల్లి మండలం ఉసిరికాయపల్లిలో దసరా సందర్భంగా నిర్వహించిన శ్రీకోటమైసమ్మ తల్లి జాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కతేలింది. ఈనెల 12నుంచి 16వ తేదీ వరకు రూ. 7. 03 లక్షలు ఆదాయం నమోదు కాగా, 20వ తేదీ వరకు వచ్చిన కానుకలను సోమవారం లెక్కించారు. ఈమేరకు నాలుగు రోజుల్లో రూ. 30, 543 ఆదాయం రాగా హుండీ ఆదాయం రూ. 7, 33, 549గా నమోదైందని, ఇది గత ఏడాదితో పోలిస్తే రూ. 31, 930 అధికమని ఆలయ ఈఓ వేణుగోపాలాచార్యులు తెలిపారు.