ఉగాది సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు నటుడు జగపతి బాబు. "ఉగాది పచ్చడి కోసం మా అమ్మ తోటకి వచ్చాను. ఇది ఆశ్రమం అంటారో తోట అంటారో తెలియడం లేదు. నన్ను మా అమ్మ చీటింగ్ చేసిందా" అంటూ సరదాగా సంభాషించారు. తన తల్లితో కాసేపు సంభాషించారు. అమ్మ చేతి ఉగాది పచ్చడి తిన్నారు. ఈ వీడియోని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.