భర్తకు కాఫీలో విషం కలిపి ఇచ్చిన భార్య.. చివరికి?

60பார்த்தது
భర్తకు కాఫీలో విషం కలిపి ఇచ్చిన భార్య.. చివరికి?
ఓ మహిళ తన భర్తకు కాఫీలో విషం కలిపి చంపాలని చూసింది. ఈ ఘటన యూపీలోని ముజఫర్ నగర్‌లోని భగేళా గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సనా అనే మహిళా వేరే వ్యక్తితో మాట్లాడుతుండేది. ఈ క్రమంలో భర్త అనూజ్ అతడితో మాట్లాడవద్దని చెప్పాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. దీంతో ఆమె కాఫీలో విషం కలిపి అనూజ్‌కు ఇచ్చింది. అనూజ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி